Magazines

తొలి దక్షిణ భారతీయ చిత్రం

5 గంటల క్రితం

South Indian film
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

పూర్తిగా మేఘాలయలో చిత్రీకరించిన తొలి తెలుగు క్రైమ్-కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్’. ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా.. ఈ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా అభినందిస్తూ వీడియో విడుద‌ల చేశారు. ‘ఇది మా రాష్ట్రానికి గర్వకారణమైన క్షణం అని పేర్కొంటూ, మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చలనచిత్రం ఇదేనని, ఇది రాష్ట్ర అందాలను మన కొండలకు ఆవల ఉన్న ప్రేక్షకులకు చేరువ చేస్తుందని ఆయ‌న పేర్కొన్నారు. పొగతో నిండిన మంచు కొండలు, అద్భుతమైన జలపాతాలు, స్వచ్ఛమైన నదులు, సజీవ వేర్ల వంతెనలను ఆయన ప్రస్తావిస్తూ, ‘మన నేలను ప్రపంచంతో పంచుకునేందుకు సినిమా మరో చక్కని అవకాశం’ అని చెప్పారు. ‘మేఘాల‌య రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా మద్దతు, ఆద‌ర‌ణ‌కు కృత‌జ్ఞ‌త‌లు. మేఘాలయ ప్ర‌జ‌లు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. అక్క‌డి ప్రకృతి దృశ్యాలు, ఆతిథ్యం మా సినిమాకి ప్రాణం పోశాయి. ఈ రాష్ట్రంలో మరెన్నో చిత్రాలు తీయాలని ఎదురు చూస్తున్నాం. సంగ్మా ప్రోత్సాహం మా బృందానికి ఎంతో విలువైనది. ఈనెల 9న విడుదలయ్యే ఈ చిత్రం మేఘాలయకు గర్వకారణంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం’ అని నిర్మాత వేణు దోనేపూడి అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్