హీరో నాగ చైతన్య నటిస్తున్న మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి అధికారికంగా ధృవీకరించారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించబోతోంది. బాపినీడు సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదలకు 50 రోజుల కౌంట్డౌన్ను పురస్కరించుకుని మేకర్స్ సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాగ చైతన్య స్టైలిష్గా, యాక్షన్ అవతార్లో కనిపిస్తున్నారు. ఇంటెన్స్ , యాక్షన్ లుక్ లో నాగ చైతన్య ఆకట్టుకుంటున్నారు. పురాణాలు, సస్పెన్స్, యాక్షన్తో కూడిన ఈ సినిమా అడ్వెంచర్, మిస్టరీతో నిండిన ప్రపంచాన్ని పోస్టర్ ద్వారా పరిచయం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ పాత్రను పోషిస్తున్నారు. రాగుల్ డి హెరియన్ డీవోపీగా పని చేస్తుండగా, అజనీష్ బి లోక్నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.







కామెంట్లు (0)