Magazines

థియేటర్లని పెంచాం

4 గంటల క్రితం

theaters
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 2 నిమిషాల చదవడం

మనోజ్ కుమార్ దర్శకత్వంలో మహారత్న ప్రొడక్షన్స్, ఎస్.కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్‌ మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘ప్రేమనే ఊరిలో’. శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూణచ్చ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందు కొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న నటుడు సాయికుమార్ మాట్లాడుతూ,‘ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ ఫిలిం. ఇప్పటికే మంచి విజయం సాధించింది. ఇది ప్రతి ఒక్కరూ ప్రేమించే సినిమా, ఎక్సిపీరియన్స్ చేసే సినిమా. మన సినిమా. మన మట్టి సినిమా. మన ఊరి సినిమా. ఈ సినిమాను మీరంతా తప్పకుండా ఆదరిస్తారని తెలుసు. ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయి. ఒక చెట్టు గురించి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ఆర్టిస్టులంతా బ్యూటిఫుల్ పర్ ఫార్మెన్స్ లు ఇచ్చారు. కథలో మంచి ఎమోషన్ ఉంది. రైతు గొప్పదనం గురించి చెప్పారు. ఒక్కటని కాదు మనల్ని ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా మనందరినీ కదిలిస్తుంది’ అని తెలిపారు. ‘మా సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులం దరికీ పెద్ద థ్యాంక్స్. ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్స్ లో చూడండి. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ పొందుతారు’ అని హీరో శ్రీరామ్ చెప్పారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ‘సినిమాకు మంచి విజయాన్ని అందించిన తెలుగు ఆడియెన్స్ కు థ్యాంక్స్. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి థియేటర్స్, స్క్రీన్స్ పెంచాం. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని ముందునుంచీ నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకాన్ని ప్రేక్ష‍కులు నిజం చేశారు’. ఈ సినిమా ఇంకా మంచి విజయం సాధిస్తుంది’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్