Magazines

సీఎం ఆకాంక్ష‍ని నెరవేరుస్తాం

2 గంటల క్రితం

Ambedkar
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇండియా జాయ్ – చిత్రరంగ కార్య నిర్వాహక కమిటీ సమా వేశాన్ని బుధవారం నిర్వ హించింది. డిసెంబర్ 7 నుండి 13 వరకు హైదరా బాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ఇండియాజాయ్ 2026కు ముందుగా తెలుగు చిత్ర పరిశ్రమను, ఏవీజీసీ-ఎక్స్ఆర్ పరిశ్రమను ఒకచోట చేర్చింది. ఈ క్రమంలో తెలుగు పరిశ్రమ నుంచి ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు సురేష్ బాబు, సి. కళ్యాణ్, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, వీఎన్ ఆదిత్య, హరీష్ శంకర్, రాహుల్ రవీంద్రన్, సాయి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ,‘ఇండియా జాయ్ గ్లోబల్ సమ్మిట్‌ని సక్సెస్ చేయడం సీఎం ఆకాంక్ష.


మా తెలుగు పరిశ్రమ ఈ సమ్మిట్‌ను విజయవంతం చేయడం కోసం సహకరిస్తుంది’ అని అన్నారు. ‘గ్లోబల్ లెవెల్‌కి మన పరిశ్రమను తీసుకు వెళ్లాలని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచనలు చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని నిర్మాత సురేష్ బాబు అన్నారు. ఇండియా జాయ్‌లో కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా అతిథులు పాల్గొన్నారు. నెట్ ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డినెగ్, ఈఏ స్పోర్ట్స్, యుబిసాఫ్ట్, అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ ఇతర గ్లోబల్ బ్రాండ్‌లకు సంబంధించిన ప్రతినిథులు విచ్చేశారు. ఈ కార్యక్రమం వందకు పైగా గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ఇంటర్నేషనల్ స్టూడియోలను ఒక చోటకు చేర్చింది. వీఎఫ్ఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ది ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ది ఇండియన్ ఫిల్మ్ కాంక్లేవ్ అండ్ ది హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు కూడా జరగున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్