నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట ప్రభుత్వం అక్కడ నిర్వహించబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
సదర్ ఉత్సవానికి రండి...
వచ్చే నెల నాలుగున హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించబోయే సదర్ ఉత్సవానికి రావాలంటూ శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గురువారం ఈ మేరకు వారు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, యాదాద్రి బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)