Magazines

గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లు 
ముమ్మరం చేయండి

18 నిమిషాల క్రితం

Intensify
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

సీఎస్‌ సంజయ్‌‌జాజు

నవతెలంగాణ-హైదరాబాద్‌‌ బ్యూరో/న్యూఢిల్లీ బ్యూరో

'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' కోసం జరుగుతున్న ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారుల్ని ఆదేశించారు. బుధవారంనాడాయన డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌రాష్ర్ట సచివాలయంలో ఈ ఏర్పట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మిట్‌‌లో భాగస్వాములు అయ్యేందుకు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, పారిశ్రామిక నాయకులు, పెట్టుబడిదారులు మరియు ఇతర ప్రముఖ వ్యక్తులకు పంపిన ఆహ్వానాలను, ఇప్పటివరకు అందిన ధృవీకరణలను పరిశీలించారు. ఆహ్వాన, ధృవీకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని, ఆహ్వానితులందరితో సమర్థవంతమైన సమన్వయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల క్రమబద్ధమైన నిర్వహణ చేపట్టాలన్నారు. అన్ని శాఖల మధ్య ప్రణాళిక, సమన్వయం అత్యవసరమని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్