Magazines

హైదరాబాద్‌కు లష్కరే బెదిరింపు

1 గంట క్రితం

Threat
avatar
balaji

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

300 మందిని చంపుతామని హెచ్చరిక
పోలీసు యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసిన నగర స్పెషల్‌ బ్రాంచ్‌


నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించి 300 మంది ప్రాణాలు తీస్తామంటూ ఉగ్రవాద సంస్థ లష్కర్‌-ఎ-తోయిబా (ఎల్‌ఈటీ) నుంచి నగర పోలీసులకు ఈ-మెయిల్‌ అందింది. దీంతో నగర పోలీసు యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడమేగాక.. పలు కీలక ప్రదేశాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ముంబయి 26/11 మాదిరిగా కాచిగూడలోని టూరిస్టు హోటల్‌తో పాటు కాచిగూడ రైల్వేస్టేషన్‌ను బాంబులతో పేల్చివేస్తామంటూ ఎల్‌ఈటీ సంస్థ నుంచి వచ్చినట్టుగా పేర్కొనబడుతున్న ఈ-మెయిల్‌లో హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన నగర స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను అప్ర మత్తం చేశారు. దీంతో నగరంలోని ప్రతి పోలీసు స్టేషన్‌ను అలర్ట్‌ చేస్తూ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. ముఖ్యంగా హోటళ్లు, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, బస్సు, రైల్వే స్టేషన్లతో పాటు జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్రదేశాల్లో సెక్యూరిటీ విభాగం అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. అనుమానిత ప్రదేశాలతో పాటు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానిత బ్యాగులు, వస్తువులు ఎక్కడ పడి ఉన్నా.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు అప్రమత్తం చేశారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్