Magazines

7 నుంచి 9 వరకు కొడంగల్‌‌లో మెగా రైతు మేళా

22 నిమిషాల క్రితం

రైతులకు ఆధునిక వ్యవసాయ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 2 నిమిషాల చదవడం

150 ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాటు..9న 50 వేల మంది రైతుల రాక

సీఎం చేతుల మీదుగా ప్రారంభం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఈ నెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కొడంగల్‌లో మూడు రోజుల పాటు మెగా రైతు మేళాను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడో తేదీన ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ మేళాను ప్రారంభిస్తారని తెలిపారు. 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 150 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ ఇన్‌పుట్స్, నూతన తరం రసాయనాలు, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, వ్యవసాయ డ్రోన్లు, వివిధ శాఖల సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ కార్యక్రమాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రదర్శించనున్నారని తెలిపారు. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అవార్డులు పొందిన రైతులతో సాంకేతిక సమావేశాలు, ముఖాముఖి చర్చలుం టాయని పేర్కొన్నారు. పలు భాగస్వామ్య సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు తమ అనుభవాలు, పరిజ్ఞానం, విజయగాథలను సహచర రైతులతో పంచుకునేలా ముఖాముఖి కార్యక్రమాల కోసం 2,500 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ప్రత్యేక హాలును ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రైతులకు యాంత్రీకరణ పరికరాలు, నూనె గానుగ యూనిట్లు, పప్పుధాన్యాలు మరపట్టే మిషన్లను సీఎం అందజేస్తారని తెలిపారు. రెండో రోజు మహిళా రైతులతో ప్రత్యేక కార్యక్రమాలుంటాయని వెల్లడించారు. చివరి రోజు పొరుగు జిల్లాల నుంచి 50 వేల మందిని సమీకరిస్తామనీ, సీఎం ప్రసంగంతో మేళా ముగిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలోని రైతులందరూ ఈ మూడు రోజుల మెగా రైతు మేళాలో పాల్గొని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్