Magazines

‌కేఆర్‌ఎంబీకి ఒక లెక్క... ప్రజలకు మరో లెక్క

28 అక్టోబర్, 2026

మంత్రి ఉత్తమ్‌‌కు హరీశ్‌‌రావు కౌంటర్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్‌వన్నీ అవాస్తవాలే : మంత్రి ఉత్తమ్‌‌కు హరీశ్‌‌రావు కౌంటర్‌

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

కృష్ణా నీళ్ల వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేస్తూ తప్పును కప్పిపుచ్చుకుంటున్నదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్‌రావు ఎక్స్‌ ‌వేదికగా బుధవారం కౌంటర్ ఇచ్చారు.

కేఆర్‌ఎంబీ సమావేశం ఎజెండాలో పేర్కొన్నది నిజమా? సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. నీళ్ల వినియోగం పై కేఆర్‌ఎంబీకి ఒక లెక్క తెలంగాణ ప్రజలకు మరో లెక్క చెప్పడమేంటని ప్రశ్నించారు. 21వ కేఆర్‌ఎంబీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అధికారిక ఎజెండాలో గతనెల 21 నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌ 45.791 టీఎంసీల నీటిని బేసిన్‌ వెలుపలి ప్రాంతాలకు తరలించగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎంజీకేఎల్‌ఐఎస్‌ ద్వారా బేసిన్‌ పరిధిలోని ప్రాంతాల అవసరాల కోసం కేవలం 10.653 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించినట్టు ఎజెండాలో పేర్కొందని వివరించారు. ఎజెండాలో ఇలా ఉంటే మంత్రి ఉత్తమ్‌ మరో లెక్క చె‌ప్తున్నారని తెలిపారు. ఈ రెండింటిలో ఏది నిజం? ఏది తప్పు?అని ప్రశ్నించారు. కేఆర్‌ఎంబీకి కాంగ్రెస్‌ ప్రభుత్వమే సమర్పించిన గణాంకాలు నిజమైతే, ‌మంత్రి చేసిన ట్వీట్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్టే కదా?అని తెలిపారు. కేఆర్‌ఎంబీని తప్పుదోవ పట్టిస్తున్నారా? తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారా?అని మంత్రిని ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా?అని అడిగారు. కృష్ణా నీళ్లను చరిత్రలో అతి తక్కువగా వినియోగించింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. నీళ్లను ఒడిసి పట్టకుండా కిందకు విడిచిపెట్టి ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారని పేర్కొన్నారు. తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్