Magazines

ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వండి

44 నిమిషాల క్రితం

తమకు బకాయి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

వొకేషనల్ ట్రైనర్ల నిరసన

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తమకు బకాయి పడ్డ 8 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరుతూ వొకేషనల్ ట్రైనర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ వొకేషనల్ ట్రైనర్స్ అసోసియేషన్ (టీవీటీఏ) ఆధ్వర్యంలో వందలాది మంది ట్రైనర్లు హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయం, పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయాల ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాలు, సమగ్ర శిక్ష పరిధిలో పని చేస్తున్న 1,900 మందికి పైగా వొకేషనల్ ట్రైనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మొత్తం 13 ఏజెన్సీల్లో 12 ఏజెన్సీల పరిధిలో పని చేస్తున్న సుమారు 1,400 మందికి పైగా ట్రైనర్లకు గత 8 నెలలుగా వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, విద్యాశాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, 12 నెలల వేతన విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖలో ఉందనీ, మరో 10 రోజుల్లో జీవో విడుదల చేసి పెండింగ్ వేతనాలు ట్రైనర్ల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఇంజం శివకుమార్, జనరల్ సెక్రెటరీ కృష్ణ, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్