Magazines

ఆద్యకళ సంరక్షకురాలు నీల 
భౌతిక కాయం గాంధీకి అప్పగింత

33 నిమిషాల క్రితం

ancient art, Neela,
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

నిమ్స్‌ ఆస్పత్రిలో గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన ఆద్యకళ సంరక్షకురాలు నీల భౌతిక కాయాన్ని మంగళవారం విద్యార్థుల పరిశోధన నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అందించారు. ప్రముఖ పరిశోధకుడు ఆచార్య జయధీర్‌ తిరుమలరావు సతీమణి అయిన నీల ఆద్యకళలోని చారిత్రక వస్తువుల భద్రత, సంరక్షణలో కీలక పాత్ర పోషించారు.

తాళపత్ర గ్రంథాలు, కాగితపు చుట్టలు, ఆదివాసీ, గిరిజన సంస్కృతికి ప్రతిబింబాలైన సంగీత వాద్యాలు, మట్టి పాత్రలు, లోహపు వస్తువులు, కులపురాణాల పటాలు వంటి అరుదైన సంపదను కాపాడడంలో ఆమె విశేష కృషి చేశారు. ఆవిడ కేఎల్ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రదానం చేశారు. ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, గోరటి వెంకన్న, ఆద్యకళ బాధ్యులు లు గూడూరు మనోజ, అరుణోదయ విమలక్క, సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నాయకులు జి.రాములు, టీపీఎస్‌‌కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, సాహితీ వేత్తలు ఏకే.ప్రభాకర్‌, కేపీ.అశోక్‌‌కుమార్‌, డీవీబీ.స్వామి, తెలంగాణ సాహితి రాష్ర్ట ఉపాధ్యక్షులు అనంతోజు మోహన కృష్ణ, పలువురు కవులు, రచయితలు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్