Magazines

కౌలు రైతులపై ఎందుకీ వివక్ష ?

32 నిమిషాల క్రితం

farmer"s
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 3 నిమిషాల చదవడం

పంట నష్టం.. అందని పరిహారం

కౌలు, పెట్టుబడి, పంటనష్టంతో నానా అవస్థలు 
 సంగారెడ్డి జిల్లాలో గుర్తించిన కౌలు రైతులు ఎనిమిది మందే

ఆదిలాబాద్‌ జిల్లాలో 481 మంది 

తప్పుల తడకగా కౌలు రైతుల గుర్తింపు

తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సర్వేలో వెల్లడి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

భూమినే నమ్ముకుని బతుకుతున్న కౌలురైతులకు రైతు భరోసా రాదు...రైతు బీమా వర్తించదు... పెట్టుబడి రుణాలు అందవు...సబ్సిడీలు అసలే రావు... ఆరుగాలం కష్టపడ్డా చేతికి పంటదక్క కపోతే ప్రభుత్వం నుంచి అందే అరకొర పంట నష్టపరిహారానికి నోచుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పంటనష్ట గుర్తింపు ప్రక్రియలో కౌలురైతులను గుర్తిస్తున్నది అరకొరే. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకూ 1,74,846 మంది పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వ అధికారులు గుర్తిస్తే అందులో కౌలు రైతులు కేవలం ఎనిమిది మంది మాత్రమే. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో నవంబర్‌ 22 నాటికి 37,666 మందిని గుర్తిస్తే అందులో కౌలురైతులు 481 మందే. ఈ కౌలు రైతుల గుర్తిం పు విషయంలో ఎంత అన్యాయం జరుగుతున్నదో చెప్పడానికి తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ చేపట్టిన సర్వేలో వెల్లడైన కఠోర వాస్తవాలివి. ఇంత కష్టకాలం లోనూ తమపై ఎందుకీ వివక్ష అని కౌలు రైతులు కన్నీటిపర్యంతం అవుతు న్నారు. తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదు కోవాలని వేడుకుంటున్నారు.


తెలంగా ణలో మొత్తం 365 మండలాలు కరువు ప్రభావితానికి గురయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో 111 మండలాలు తీవ్ర, 254 మండలాలు మధ్యస్థ కరువుకు గురైనట్టు వెల్లడించింది. అందులో సంగారెడ్డి జిల్లాలో 28, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ ‌జిల్లాల్లో 20 చొప్పున ఉన్నట్టు గుర్తించింది. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో నవంబర్‌ 30 ‌నాటికి మొత్తం 37,666 పంట నష్టపోయిన రైతులను అధికారులు గుర్తించారు. బోథ్‌ ‌మండలంలో కౌట(బి) క్లస్టర్‌‌లో 1,100 మంది రైతులను గుర్తించగా అందులో కౌలు రైతులు కేవలం ఏడు మంది మాత్రమే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 25 మండలాల పరిధిలోని 494 గ్రామాల్లో 1,74,846 మంది రైతులకు సంబంధించి 1,26,330 హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. అందులో కౌలురైతులుగా నమోదైంది కేవలం ఎనిమిది మంది మాత్రమే. వికారాబాద్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాల్లో పది గ్రామాల్లో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ అధ్యయనం చేసింది.

ఆదిలాబాద్‌ ‌జిల్లాలో కౌట(బోథ్‌), పిప్పర్వాడ(బోరజ్‌), నిపాని(భీంపూర్‌), పంచలింగాల (మర్పల్లి), జీవంగి(బషీరాబాద్‌), వికారాబాద్‌ ‌జిల్లాలో అమ్రాదికలాన్‌ (‌మోమిన్‌‌పేట), ఇనాపూర్‌(‌దోమ), యావాపూర్‌(‌నవాబ్‌‌పేట)లలో 145 మంది రైతులను కలువగా అందులో 89 మంది(66 శాతం) భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నవారే ఉన్నారు. వారు 695 ఎకరాలను సాగు చేస్తున్నారు. పంటనష్టపరిహారం జాబితాలో వీరిలో ఒక్కరి పేరు కూడా నమోదు కాలేదని తేలింది. ‘గ్రామంలో కొన్ని చోట్ల కూర్చొని భూ యజమానుల ద్వారానే సర్వే పూర్తి చేశారనీ, మేం ఏం విత్తామో..ఎంత నష్టపోయామో అడగనే లేదు’ అని కౌలురైతులు పలు గ్రామాల్లో వాపోయారు. కౌలు రైతులను పంట నష్ట పరిహార జాబితాలో నమోదు చేయవచ్చనే విషయం తమకు తెల్వదని చెప్పారు.సంగారెడ్డి జిల్లాలో సాధన కమిటీ 275 మంది కౌలు రైతుల వివరాలు సేకరించగా అందులో 271 మంది ఎల్‌‌నినో ఎఫెక్ట్‌‌తో పంటలను నష్టపోయారు.


అందులో 245 మంది పేర్లు పంట నష్టపరిహార జాబితాలో చేర్చనేలేదు. 24 మంది కౌలు రైతుల నష్టాన్ని భూ యజమాని పేరుతో నమోదు చేశారు. ‘గతంలో పరిహారాన్ని యజమాని పేరుతో తీసుకుని తమకు ఇవ్వలేదు’ అని 17 మంది కౌలు రైతులు చెప్పారు. వికారాబాద్‌ ‌జిల్లాలో అధికారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టే నాటికి 90 శాతం పత్తి కోత పూర్తయింది. 79 ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్‌ ‌పంట నష్టం వాటిల్లింది. పంట కోత పూర్తయిందనే కారణంతో ఆ రైతులను పంట నష్టపరిహార జాబితాలో చేర్చల ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల పత్తి కూడా పండలేదనే విషయం జగ మెరిగిన సత్యమే. వాస్తవ సాగు దారులైన కౌలు రైతుల పేర్లను పంట నష్టపరిహార జాబితాలో చేరిస్తే భూ యజమానులు కోర్టుకు వెళ్తారని ఏఈఓలు, డీఏఓలు చెబుతున్న పరిస్థితి. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో సమా ధానం ఇచ్చిన 32 మంది కౌలు రైతుల్లో 27 మంది తమ పేరు నమోదుకు భూ యజమాని అంగీకరిస్తారని చెప్పారు. అయినా, కౌలు రైతుల పేర్లను ఎందుకు నమోదు చేయడం లేదో అధికారులకే తెలియాలి.


ఇవీ సిఫారసులు..

పంట నమోదు రికార్డులో యాప్‌‌లోని కౌలు రైతు వివరాల స్కీన్‌‌ను ఉపయోగించి కరువు మండలా ల్లోని కౌలు రైతుల పేర్లను నమోదు చేయాలి. కౌలు రైతు స్వీయ ధ్రువీకరణకు అవకాశమిచ్చి క్షేత్ర స్థాయి తనిఖీ ద్వారా గుర్తించాలి. పంట నష్టం నమోదులో కౌలు రైతులను నేరుగా చేర్చాలి. పంట నష్టపరిహారానికి కౌలు రైతులు అర్హులని చెబుతూ ప్రతి గ్రామంలో చాటింపు వేయించాలి. ప్రతి గ్రామంలో పంట నష్ట గుర్తింపు సర్వే పూర్తికాగానే సాగుదారుడు యజమానినా? కౌలు రైతా? అనే విషయాలను వెల్లడించేలా గ్రామపంచాయతీల వద్ద జాబితాలను ప్రదర్శించాలి. గణనకు ముందే కోసిన మొక్కజొన్న, సోయాబీన్‌, పెసర, మినుము, పత్తి, ఇతర పంటలను రైతులకు కలిగిన నష్టం ఆధారంగా సర్వేలో చేర్చాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్