నవతెలంగాణ హైదరాబాద్: పెళ్లికి తమ కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లింఖేడా తాలూకాకు చెందిన రాజేష్ నినామా (22), అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, గత వారం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రాజేష్ ఆ బాలికను తీసుకుని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వివాహానికి అనుమతి కోరాడు. అయితే, ఇద్దరూ ఒకే కులానికి, ఒకే ఇంటిపేరుకు చెందిన వారు కావడంతో ఇరు కుటుంబాలు వారి పెళ్లికి వ్యతిరేకించాయి.
ఈ క్రమంలో, అక్టోబర్ 4వ తేదీ ఆదివారం ఉదయం సింగ్వాడ్ తాలూకాలోని హీరాపూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి, అక్కడ తమ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ప్రారంభించి, బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ లైవ్‌ను వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా సుమారు 50 మందికి పైగా చూసినట్లు తెలుస్తోంది.
లైవ్‌లో జరుగుతున్న దారుణాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సిగ్నల్ సమస్య వల్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోపే ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో జంట బలవన్మరణం
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)