నవతెలంగాణ - హైదరాబాద్ : హర్మూజ్ జలసంధిలో దాడులు, చమురు సరఫరాకు అంతరాయాల భయాలతో ముడి చమురు ధర బ్యారెల్కు 107 డాలర్లకు చేరింది. సౌదీ అరేబియాలోని లక్ష్యాలు, రవాణా నౌకలపై దాడులు పెరగడంతో ధరలు 110 డాలర్ల దిశగా పయనిస్తున్నాయి. యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ధహ్రాన్లోని సౌదీ అరాంకో పరిపాలనా భవనంతో సహా పలు లక్ష్యాలపై దాడులు ముమ్మరం చేయడం ఈ పెరుగుదలకు కారణమైంది. చమురు ధరలు పెరిగితే భారత్ దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, డాలర్లకు డిమాండ్ పెరిగే ప్రమాదం ఉంది.
110 డాలర్ల దిశగా ముడి చమురు ధరలు
53 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)