Magazines

రాహుల్‌గాంధీకి లేఖ రాసిన హరీష్‌రావు

10 గంటల క్రితం

Rahul gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తెలంగాణలోని కీలక విద్యుత్ రంగ సంస్థల్లో వాటాల విక్రయం లేదా ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. టీజీ ట్రాన్స్‌కోలో 26 శాతం వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించి నిధులు సమీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజాధనంతో నిర్మితమైన టీజీ ట్రాన్స్‌కో, రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థకు వెన్నెముక వంటిదని హరీశ్ రావు తన లేఖలో పేర్కొన్నారు. వేలాది కిలోమీటర్ల మేర విస్తరించిన విద్యుత్ లైన్లు, హై-వోల్టేజ్ సబ్‌స్టేషన్లతో కూడిన ఈ సంస్థ అత్యంత విలువైన ఆస్తి అని వివరించారు. ట్రాన్స్‌కోలో ప్రైవేట్ వాటాలకు అనుమతినిస్తే, భవిష్యత్తులో టీజీ జెన్‌కో, సింగరేణి, డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు కూడా ఇది మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్