Magazines

దీపావళి బాణసంచాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

01 అక్టోబర్, 2026

Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : దీపావళి వేళ బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాణసంచాపై పూర్తిగా నిషేధం విధించేందుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. అదే సమయంలో రోజంతా ఎలాంటి పరిమితులు లేకుండా కాల్చేందుకు కూడా అనుమతించలేమని తేల్చి చెప్పింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్ పి.బి.వరాలేతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. దీపావళితో ముడిపడిన మతపరమైన భావాలను గౌరవిస్తూనే.. వాయు కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఎదురయ్యే ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్