నవతెలంగాణ–హైదరాబాద్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటన తీవ్ర కలకలం రేపింది. 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని కో-పైలట్ ప్రమాదంలోకి నెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో.. పైలట్, ప్రయాణికులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికుడు యానివ్ హయూన్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి కీలకంగా మారింది.
కాక్‌పిట్‌లో ఘర్షణ జరుగుతున్న సమయంలో యానివ్ మరో ఆఫ్‌డ్యూటీ పైలట్‌తో కలిసి లోపలికి వెళ్లారు. అప్పటికే కెప్టెన్ స్మిత్ మచ్చర్ స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నప్పటికీ కాక్‌పిట్ డోర్‌ను అన్‌లాక్ చేసి కిందపడిపోయారు. లోపలికి వెళ్లిన యానివ్.. కో-పైలట్‌ను బయటకు లాగిన అనంతరం విమానం ఎత్తు తగ్గుతున్నట్లు గుర్తించి కంట్రోల్ స్టిక్స్‌ను వెనక్కి లాగినట్లు తెలిపారు.
వృత్తిరీత్యా తాను ప్లంబర్‌నని యానివ్ చెప్పారు. అయితే గతంలో చూసిన ఎయిర్‌క్రాష్ ఇన్వెస్టిగేషన్ టీవీ షోలోని దృశ్యాలు గుర్తుకు రావడంతో కంట్రోల్ స్టిక్స్‌ను వెనక్కి లాగినట్లు వివరించారు. అనంతరం ఆఫ్‌డ్యూటీ పైలట్ విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు.
విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఇజ్రాయెల్‌కు చేరుకున్న తర్వాత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యానివ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ ‘హీరో’గా పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో జరిగిన పరిణామాలను యానివ్ నెతన్యాహుకు వివరించారు.
కో-పైలట్‌ను అడ్డుకునేందుకు ధైర్యంగా పోరాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కూడా నెతన్యాహు ప్రశంసించారు. విమానం ఇజ్రాయెల్‌కు చేరి ఉంటే తీవ్ర పరిణామాలు జరిగేవని, మరో 9/11 తరహా ఘటన జరిగి ఉండేదేమోనని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.






కామెంట్‌లు (0)