Magazines

వెస్టిండీస్‌ 295/7.. భారత్‌ ముందు భారీ లక్ష్యం

9 గంటల క్రితం

West Indies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ముందు 296 పరుగుల లక్ష్యం నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఓపెనర్‌ జస్టిన్‌ గ్రీవ్స్‌ (101) సెంచరీతో చెలరేగగా.. అమీర్‌ జంగూ (58 నాటౌట్‌) చివర్లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. జాన్‌ క్యాంప్‌బెల్‌ (62) కూడా అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లతో విండీస్‌ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ 2, నితీశ్‌ రెడ్డి ఒక వికెట్‌ తీశారు. ఒక దశలో 176/2తో పటిష్ఠంగా ఉన్న విండీస్‌.. కుల్దీప్‌ వరుస వికెట్లతో 198/5కి చేరింది. అయితే చివర్లో జంగూ వేగంగా పరుగులు రాబట్టడంతో వెస్టిండీస్‌ 295 పరుగులకు చేరుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్