నవతెలంగాణ-ఆసిఫాబాద్
డిపో పరిధిలో వివిధ క్షేత్రాల దర్శన కోసం భక్తుల సౌకర్యార్థం "దివ్య క్షేత్రాలయాత్ర"పేరుతో రెండు వేరువేరు యాత్రలు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి యాత్ర ఈనెల 4వ తేదీన ఉదయం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తుందని, దీనిలో భాగంగా కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, గూడెం గుట్ట దర్శన కార్యక్రమం ఉంటుందని దీనికోసం పెద్దలకు 799, పిల్లలకు 400 టికెట్ నిర్ణయించడం జరిగిందని, రెండవ యాత్రలో భాగంగా ఈనెల 10వ తేదీన కొమురవెల్లి, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి దర్శనాలు ఉంటాయని దీనికోసం ఒక్కొక్కరికి 1100 టికెట్ నిర్ణయించినట్లు తెలిపారు. భోజనం ప్రయాణికులు ఎవరికి వారుగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 8328021517, 9493282510, 9063405992 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.





కామెంట్‌లు (0)