Magazines

రామన్నగూడెంలో భూ రీసర్వే ప్రారంభం

7 గంటల క్రితం

Land survey
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

– క్యడస్ట్రల్ విభాగంలో ఐదు రెవెన్యూ గ్రామాలు

– క్షేత్రస్థాయిలో పరిశీలించిన తహశీల్దార్ దాసరి కిశోర్

నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే అశ్వారావుపేట మండలంలో కొనసాగుతోంది. మండలంలో నాన్‌ క్యడస్ట్రల్‌ విభాగంలో దురదపాడు, క్యడస్ట్రల్‌ విభాగంలో రామన్నగూడెం, కన్నాయిగూడెం, అనంతారం, మద్దికొండ, ఖమ్మంపాడు రెవెన్యూ గ్రామాలను భూ రీసర్వేకు ఎంపిక చేశారు. ఇప్పటికే దురదపాడు గ్రామంలో భూ రీసర్వే చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో గురువారం రామన్నగూడెం గ్రామంలో భూ రీసర్వే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ దాసరి కిశోర్‌ క్షేత్రస్థాయిలో రీసర్వే పనులను పరిశీలించారు. సర్వేయర్‌ నాగరాజుకు పలు సూచనలు చేశారు. రీసర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్