Magazines

వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం రావాలి

51 నిమిషాల క్రితం

mbnr
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

- అన్ని వర్గాలు రాజకీయంగా ఎదగడమే బిఎస్పి లక్ష్యం

- రాబోయే కాలంలో బీఎస్పీ ప్రభంజనం ఉంటుంది

- బీఎస్పీ రాష్ట్ర నాయకులు డాక్టర్ నాగార్జున

నవతెలంగాణ - ఊరుకొండ 

వెనకబడిన అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాధికారం రావాలని.. మంచి నాయకుడు ఈ వర్గంలో ఉన్న మా మద్దతు పుష్కలంగా ఉంటుందని.. అన్ని వర్గాలు రాజకీయంగా ఎదగడమే బిఎస్పి పార్టీ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర నాయకులు డాక్టర్ అంకురి నాగార్జున అన్నారు. ఆదివారం ఊరుకుండ మండల పరిధిలోని మాదారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు డాక్టర్ అంకురి నాగార్జునతో పాటు జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్ ముదిరాజులు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ ప్రభంజనం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్ని వర్గాలలో రాజకీయ చైతన్యం తీసుకురావడమే బిఎస్పీ లక్ష్యమని గుర్తు చేశారు. బీఎస్పీ నటించే పార్టీ కాదని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడంతోపాటు అనుకున్న లక్షలను నెరవేర్చడంలో ముందుంటుందని.. సుప్రీం లీడర్ మాయావతి అని అన్నారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు.. దిక్సూచిగా పనిచేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కాన్సిరాం మాదిరిగానే మాయావతి కూడా ఆదర్శ నాయకురాలిగా పనిచేస్తున్న దిక్సూచి అని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన.. ఓట్ల ప్రాతిపదికన.. మన ఓట్లు మనమే వేసుకుని రాజ్యాధికారాన్ని చేపట్టుకోవాలని పిలుపునిచ్చారు.

అసమానతలు లేని సమాజ స్థాపనలో.. సమ సమాజ నిర్మాణంలో వెనకబడిన అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు చెన్నయ్య, ఎస్పీ పరశురాం, కొమ్ము శ్రీను, అంకురి బాలరాజు, అంకురి పరుశురాం, అంకూరి ఎర్ర బందిగయ్య, భాస్కర్ రావు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్