Magazines

దోమల నివారణకు...

47 నిమిషాల క్రితం

నిమ్మతో  దోమలను
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నిమ్మతో
దోమలను ఆకర్షించకుండా చేయడానికి నిమ్మరసాన్ని నీటిలో కలిపి ఇళ్ల మూలల్లో చల్లి చూడండి. నిమ్మకాయ తొక్కలను దొమలు ఎక్కువగా చేరే ప్రదేశాల్లో ఉంచితే అవి దూరంగా ఉంటాయి.
వెల్లుల్లి నీరు
వెల్లుల్లి రెబ్బలను కోసి గదిలో ఉంచితే దోమలను దూరం చేయవచ్చు. వెల్లుల్లిని నీటిలో మరిగించి ఆ నీటిని గదుల్లో స్ప్రే చేయండి. వెల్లుల్లి వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. కర్పూరాన్ని చిన్న పాత్రలో వెలిగించి గదిలో ఉంచితే దోమలు మరణిస్తాయి.
లెమన్ గ్రాస్
లెమన్ గ్రాస్ నూనెను దీపం వెలిగించేటప్పుడు కొన్ని చుక్కలు వేయవచ్చు. లెమన్ గ్రాస్ ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని స్ప్రే చేయవచ్చు. వేప నూనెను నీటిలో కలిపి గదుల్లో స్ప్రే చేస్తే దోమలు దూరమవుతాయి. కాఫీ పొడి వంటింట్లో ఉన్న
కాఫీ పొడి
దోమలను మటుమాయం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీటి నిల్వ ప్రాంతాల్లో కాఫీ పొడిని చల్లితే దోమ గుడ్లు పగిలిపోతాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్