కలెక్టరేట్ల ఎదుట వామపక్షాల ధర్నాలు
ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి
తొలగించిన ఓట్లలో అర్హులైన వారిని చేర్చాలి
సర్‌ను నిలిపేయాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి పునాదని, అర్హులైన ప్రతి పౌరుడి ఓటుహక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. సర్ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, సర్ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం ఏఓ దేశ్‌పాండే శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసి దేశ వ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించి ప్రజా స్వామ్యా న్ని రక్షించాలంటూ నిజా మాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు. ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిం చారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో ధర్నాలు, ర్యాలీలు తీశారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను
పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఐ(ఎం), టీజేఎస్, సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్‌చంద్రబోస్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన చేపట్టారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహిచారు. అలాగే, వరంగల్ జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన, ధర్నా నిర్వహించారు.ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని, సర్ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద, మెదక్ జిల్లా కేంద్రంలో పోస్టాఫీస్ చౌరస్తా సెంటర్‌లో, సిద్దిపేట పట్టణంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేశంలో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడం అన్యాయం, అక్రమమన్నారు. తొలగించిన ఓట్లను వెంటనే తిరిగి పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మ్ 6ను పాత పద్ధతిలో కొనసాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జ్ఞానేశ్ కుమార్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించేదాకా పోరాటం కొనసాగు తుందని స్పష్టం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి మెమోరాండం అందజేశారు.






కామెంట్‌లు (0)