Magazines

బడుల మూత, బార్‌ల మోత

48 నిమిషాల క్రితం

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం

ఇది తుగ్లక్ పాలనా, ప్రజా పాలనా? : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్‌ ‌
రాష్ట్రంలో బడుల మూత, బార్ల మోత అన్న పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. ఇది తుగ్లక్ పాలనా, ప్రజా పాలనా?అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌ వేదిక ‌ద్వారా ట్వీట్‌ ‌చేశారు. క్యూర్‌, కొత్త మున్సిపాల్టీల్లో జనాభా ప్రాతిపదికన కొత్తగా 41 బార్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త బార్ల కోసం వచ్చేనెల 12 వరకు దరఖాస్తులను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా 105 తెలంగాణ పబ్లిక్‌ ‌స్కూళ్ల (టీపీఎస్‌)ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‌టీపీఎస్‌‌లను ప్రారంభించడం వల్ల సమీపంలో ప్రభుత్వ బడులు మూసివేతకు గురవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ రెండు అంశాలపై కేటీఆర్‌ ‌స్పందించారు. మద్యాన్ని నియంత్రించడంలో, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
​
బుల్లెట్‌ ‌రైలు రైతుల కోసం సుప్రీంకు వెళ్తాం
నాలుగు తరాలుగా భూమిని సాగు చేసుకుంటున్న రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్నదని కేటీఆర్‌ ‌విమర్శించారు. బుల్లెట్‌ ‌రైలు వల్ల భూములు కోల్పోతున్న రైతుల కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడుదామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవ‌న్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గం, శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులతో కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఫొటోను పోలీస్‌ ‌స్టేషన్‌‌లో పెట్టాలన్నారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, గద్దల్లా రైతుల భూములపై పడుతున్న రేవంత్ రెడ్డి ఫొటో పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. పేదల భూములు తీసుకోవడమే ఇందిరమ్మ రాజ్యమా?అని ప్రశ్నించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, సీఎం రేవంత్ రెడ్డి సోదరుల ఇండ్లు, ఎంపీ బలరాం నాయక్‌ ఇండ్లు కనిపించవా?అని అడిగారు. ఏడాది ఆగితే కేసీఆర్ సీఎం కావడం ఖాయమనీ, కాంగ్రెస్‌ వాళ్ల ఆటలు ఇంకో ఏడాది మాత్రమే‌నని అన్నారు.
ఎయిర్‌పోర్ట్ భూముల్లో 13 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందనీ, ఆ భూమిని బుల్లెట్ రైలు కోసం తీసుకోవచ్చు కదా?అని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి భూములు అమ్మడం, కమీషన్లు తీసుకోవడమే పని అని అన్నారు. కోర్టు రైతులకు అండగా ఉంటుందన్నారు. మాజీమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ భూములు అమ్మి పెద్దలకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజేంద్రనగర్‌ ‌బీఆర్‌ఎస్‌ ఇన్‌‌చార్జీ కార్తీక్‌‌రెడ్డి మాట్లాడుతూ ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది బహదూర్ గూడా రైతుల పరిస్థితి అని చెప్పారు. బుల్లెట్‌ ‌రైలు కోసం వెయ్యి ఎకరాల భూమి అవసరం లేదన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్