Magazines

సర్‌ప్రైజ్‌ చేసే కథ

4 గంటల క్రితం

A story that surprises
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్బంగా మేకర్స్‌ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వి.వి. వినాయక్ మాట్లా డుతూ, ‘లగడపాటి శ్రీధర్ కి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ గురించి నాకు తెలుసు. విక్రమ్ పెద్ద హీరో అయి శ్రీధర్ కోరికని నెరవేర్చుతాడు. దర్శక, నిర్మాతలకు మంచి లాభాలు రావాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు. ‘ఈ సినిమా ఒక ప్రేమ కథ, ఒక ఫ్రెండ్షిప్ కథ.. ఓ ఫ్యామిలీ కథ. ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను’ అని విక్రమ్ సహిదేవ్ చెప్పారు. త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ, ‘ఆట మంచి రసవత్తరంగా ఉన్నప్పుడు మరింత ఇంట్రె స్టింగ్‌గా చూస్తాం. ఈ చిత్రంలో ప్రతీ పాత్ర మధ్య అంతే పోటీ ఉంటుంది. ఈ చిత్రాన్ని ప్రేక్ష‍కులు ఒక్క సెకన్ కూడా డీవియేట్ అవ్వకుండా చూస్తా రు. ఈ చిత్రంలో పాటలు, మాటలు, ఫైట్స్ ఇలా అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉంటుంది. అక్టోబర్ 2న మా సినిమా పక్కాగా రాబోతోంది’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్