Magazines

గ్రే షేడ్స్‌ ఉన్నప్పటికీ..

4 గంటల క్రితం

Despite having grey shades...
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్ష కులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం 'తత్వం'. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరో యిన్లు. అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ నిర్మించారు. అక్టోబర్‌ 2న ఈ చిత్రం థ్రియేటికల్‌ విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా సోమవారం కథానాయిక దష్విక.కె. మీడియాతో ముచ్చటించారు. నా స్వస్థలం వైజాగ్‌. ఇది నా తొలి సినిమా. ఈ సినిమా కోసం చేసిన ఆడిషన్స్‌లో సెలెక్ట్‌ అయ్యాను. గతంలో హీరో విజయ్‌ దేవర కొండతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించాను. తొలి సినిమాలోనే నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర దొరకడం ఆనందంగా ఉంది. ఈ కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఎమోషన్‌ ఉన్న పాత్ర ఇది. నా పాత్రలో గ్రే షేడ్స్‌ ఉంటాయి. కానీ, అందరికి నచ్చే పాత్ర నాది. కిల్లర్‌ను అన్వేషించడంలో హీరోకు సపోర్ట్‌ చేస్తూ ఉంటే పాజిటివ్‌గా ఉండే పాత్ర నాది. ఇది మర్డర్‌ మిస్టరీ సస్పెన్స్‌. ఎక్కడ ఎలాంటి పాయింట్స్‌ ఉం డాలో అవి ఉంటాయి. దర్శకుడు అర్జున్‌ కోలా చాలా సైలెంట్‌. సాప్ట్‌ వేర్‌ జాబ్‌కి మూడు నెలలు సెలవు పెట్టి, ఈ సినిమా చేశాడని తెలిసి ఆశ్చర్య పోయాను. తను చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తన విజన్‌కి తగ్గట్టు మా నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్