Magazines

‘గీతాంజలి’ రీ- రిలీజ్‌కి రెడీ

4 గంటల క్రితం

Geethanjali
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

కొన్ని సినిమాలు విడుదలై ఎన్నేళ్లు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంటాయి. అలాంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో అక్కినేని నాగార్జున నటించిన ‘గీతాంజలి’ ఒకటి. ఇప్పుడు ఈ క్లాసిక్ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 4కే వెర్షన్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుతమైన కథనం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, గొప్ప సంగీతంతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమ, భావోద్వేగాలు, అందమైన అనుభూతులను ప్రత్యేకమైన శైలిలో ఆవిష్కరించింది. ఇప్పటివరకు ‘గీతాంజలి’ని ప్రేమించిన ప్రేక్షకులకు ఈ 4కే ఫార్మెట్‌ రీ-రిలీజ్ మరోసారి ఆ మధురానుభూతిని అందించనుంది. పిక్చర్ క్వాలిటీ, విజువల్ డీటైలింగ్‌తో సినిమా మరింత గ్రాండ్‌గా కనిపించనుంది. అలాగే ఒరిజినల్ సినిమా అందించిన ఎమోషన్, చార్మ్‌ను ఎలాంటి మార్పు లేకుండా ప్రేక్షకులకు అనుభూతినిస్తుంది. మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎవర్ గ్రీన్. బూర్లె శివ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీ పద్మిని సినిమాస్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను మరోసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తోంది. పాతతరంతోపాటు కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బిగ్ స్క్రీన్‌పై ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం లభించనుంది అని మేకర్స్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్