పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మయూఖ’. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో శశిధర్ నల్ల నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల మాట్లాడుతూ, ‘సినిమా అద్భుతంగా వచ్చింది. ట్రైలర్ లాగే సినిమా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ఈ సినిమా తర్వాత పాయల్ ను అందరూ మయూఖ అని పిలుస్తారు. అంత బాగా పర్ఫార్మ్ చేసింది. మా సినిమాకు అన్నీ తానై చూసుకున్నాడు మా డైరెక్టర్ శ్రీ తేజ్. కంటెంట్ బాగుంటే మన తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. అలాంటి కంటెంట్ మా సినిమాలో ఉంది. అదే నమ్మకంతో మా చిత్రాన్ని అక్టోబర్ 9న దసరా సెలవుల్లో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం’ అని తెలిపారు. ‘ఫీమేల్ ఒరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ ఇది. కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమా మీకు కొత్త ఫీల్ కలిగిస్తుంది’ అని హీరోయిన్ పాయల్ చెంగప్ప చెప్పారు. డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్. కె. మాట్లాడుతూ,‘తెలుగు చిత్రాల్లో ‘మయూఖ’ లాంటిది అరుదుగా వస్తుందని చెప్పగలను. హాలీవుడ్, కొరియన్ మూవీలా కలర్ గ్రేడింగ్ చేశాం. మా సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని హామీ ఇస్తున్నా’ అని అన్నారు.







కామెంట్‌లు (0)