తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పట్ల వివక్ష తీవ్రస్థాయికి చేరిందని, కష్టపడి నిర్మించిన చిత్రా లకు థియేటర్లు ఇవ్వకుండా ప్రొడ్యూ సర్లు, డైరెక్టర్లను నాశనం చేస్తున్నా రని 'ఓ అందాల రాక్షసీ' మూవీ మేకర్, హీరో షిరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డుతూ, ‘అందరి సహకారంతో, మంచి సాంకేతిక నిపుణులతో ఒక అద్భుత మైన చిత్రాన్ని నిర్మించాను. అయితే ఈ సినిమాను సరిగ్గా థియేటర్లలో విడుదల చేస్తే రికార్డులు బద్దలవు తాయి. కానీ సినిమా థియేటర్ల కేటా యింపులో అన్యా యం జరిగింది. సెన్సార్ నిబం ధనలు, ఏడీసీసీ ప్రాసెస్ పేరుతో చిన్న నిర్మాతల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. క్యూబ్, యుఎఫ్ఒ డిజిటల్ ప్రొవైడర్లు వారానికి రూ. 2,000 లో చేసే పనికి ప్రతి థియేటర్ నుండి రూ. 10 వేల నుండి రూ.12 వేల వరకు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ విధానం వల్ల చిన్న నిర్మాతలు కోలుకోలేని విధంగా నష్టపోతు న్నారు. తెలుగు ఫిల్మ్ ఛాం బర్ చిన్న ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు అండగా నిలవకపోగా, నల్లి లాగా నలిపే స్తోంది. ఐనాక్స్, పివిఆర్, ఏషియన్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లు మొదట థియేటర్లు ఇస్తామని చెప్పి, చివర్లో హ్యాండ్ ఇచ్చారు. సినిమా పరి శ్రమలో సాగుతున్న ఈ మాఫియా పోకడలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు.







కామెంట్‌లు (0)