నవతెలంగాణ-హైదరాబాద్: దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న 'ఫ్లైదుబాయ్' విమానంలో కో-పైలట్, పైలట్‌ను కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఘటనపై న్యాయపరమైన సమగ్ర విచారణను ప్రారంభించినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) అధికారికంగా ప్రకటించింది. విమానం కాక్‌పిట్ (flight deck)లో జరిగిన ఘర్షణ అనంతరం, ఆ బోయింగ్ 737 విమానం దారి మళ్లించబడి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది.
ఏం జరిగింది? :
బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 180 మంది ఇజ్రాయిల్ ప్రయాణికులతో ఫ్లై దుబాయ్ విమానం FZ1073 టెల్ అవీవ్‌కు బయలుదేరింది. గాల్లో ఉండగా హఠాత్తుగా విమానం కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే 34,000 అడుగుల ఎత్తు నుంచి 16,600 అడుగులకు అమాంతం పడిపోయింది. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలో ఏవియేషన్ వర్గాలకు రెండు కీలక ప్రమాద హెచ్చరికలు వచ్చాయి. తొలుత సాధారణ ఎమర్జెన్సీ కోడ్ 7700 అందింది. ఆ వెంటనే హైజాక్‌ను సూచించే 7500 కోడ్ ట్రాన్స్‌మిట్ కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.






కామెంట్‌లు (0)