నవతెలంగాణ - హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తరఫున ధరాపురం నుంచి గెలిచిన సత్యభామ, కొద్ది వారాలకే తన పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇప్పుడు అదే స్థానం నుంచి టీవీకే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉప ఎన్నికల్లో భాగంగా ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. "నిజానికి వ్యతిరేకంగా పనిచేసిన వారి అభ్యర్థిని ఇప్పుడు మీరంతా 'సూట్‌కేస్-భామ' అని పిలుస్తున్నారు. ఆమెకు 'పల్టీ-భామ' అని మరో పేరు కూడా ఉంది. ఆ శరీరాకృతితో ఆమె ఎలా పల్టీ కొట్టారో నాకు అర్థం కావడం లేదు" అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
సత్యభామ శరీరాకృతిపై స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీవీకే తీవ్రంగా స్పందించింది. ఇది మహిళలను, దళిత సమాజాన్ని అవమానించడమేనని ఆ పార్టీ నేత, ఆరోగ్య మంత్రి అరుణ్ రాజ్ మండిపడ్డారు. స్టాలిన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం స్టాలిన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: టీవీకే
57 నిమిషాల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)