Magazines

ఐసిసి మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం

03 సెప్టెంబర్, 2026

Trophy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 1 నిమిషాల చదవడం

దుబాయ్‌: ఐసిసి మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. మ్యాచ్‌లు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (ముంబయి), వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. కటాఫ్‌ డేట్ అయిన జులై 6 నాటికి మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఇందులో పోటీపడనున్నాయి. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్‌ ఈ టోర్నమెంట్‌కు దూరమైంది. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. టాప్‌-2లో నిలిచిన టీమ్‌లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మహిళల చాంపియన్స్ ట్రోఫీ-2027 మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని ఐసీసీ చైర్మన్ జై షా తెలిపారు. ఇటీవలికాలంలో ప్రతి ఏడాది ఒక ఐసిసి మహిళల టోర్నమెంట్ జరగడంతో మహిళల క్రికెట్‌కు ఆదరణ విశ్వవ్యాప్తంగా పెరుగుతోందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్