నవతెలంగాణ - హైదరాబాద్ : నల్గొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మీర్బాగ్ కాలనీ రోడ్డు నంబర్-6లోని షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. నల్గొండలో నూతనంగా నిర్మించనున్న ఓ షాపింగ్ మాల్ నిర్మాణ పనుల కోసం చెన్నై నుంచి కొంతమంది కూలీలు వచ్చారు. వారు అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తులో రూమ్ నంబర్ 402లో ఉంటున్నారు. కూలి డబ్బుల విషయంలో వారిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని డీఎస్పీ శివరామిరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టూటౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదాబాబు ఆధ్వర్యంలో క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తోంది.






కామెంట్‌లు (0)