Magazines

భారీగా పెరిగిన చికెన్‌ ధరలు

1 గంట క్రితం

Chicken prices
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. గత వారంతో పోలిస్తే కిలోపై రూ.20 నుంచి రూ.30 వరకు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.287, డ్రెస్డ్ చికెన్ రూ.254గా ఉంది. విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ రూ.284, డ్రెస్డ్ చికెన్ రూ.251గా కొనసాగుతోంది. ఇక కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి. విజయవాడలో 12 గుడ్ల రిటైల్ ధర రూ.80 కాగా.. హైదరాబాద్, కరీంనగర్‌లో రూ.74గా ఉంది. పౌల్ట్రీ ఉత్పత్తి, సరఫరాలో వ్యత్యాసాలు, పండుగల నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్