Magazines

హతవిధీ..!

2 గంటల క్రితం

cruel fate
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 2 నిమిషాల చదవడం

ట్రంప్ పిలుపును పట్టించుకోని కిమ్

అమెరికా లేఖను కనీసం చదవకుండా వెనక్కి

ప్యాంగ్యాంగ్: ప్రపంచాన్నే గడగడ లాడించే అమెరికా అధ్యక్షుడి పరిస్థితి మయసభలో ద్రౌపది మాదిరిగా తయారైంది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును గుడ్డిగా నమ్మి ఇరాన్ పై యుద్ధానికి దిగిన ట్రంప్ చరిష్మా దిగజారి పోయింది. ఇపుడు ఆయన చేసే హెచ్చరిక లను ఎవరూ లెక్కచేయటం లేదనటానికి తాజా పరిస్థితులే అద్దం పడుతున్నాయి.

ఏం జరిగింది.?

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తో చర్చలు జరపాలన్న ట్రంప్‌ ప్లాన్‌ అవమానకర ఘటనతో ముగిసింది. అమెరికా అధ్యక్షుడు గతేడాది నుంచి ఉత్తరకొరియా అధినేతతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కమ్యూనికేషన్‌ ఛానల్స్‌, ఫోన్‌ లైన్స్‌ ద్వారా ప్రయత్నించినా.. కిమ్‌ వైపు నుంచి ప్రతిస్పందన రాలేదు. చివరికి ట్రంప్‌ ఇటీవల ఓ లేఖను రాసి కిమ్‌జోంగ్‌ ఉన్‌కు చేరవేయా లని అమెరికా అధికారులకు అందజేశారు. అయితే.. ఇందుకోసం అధికారులు ఓ అసాధారణ ప్లాన్‌ రచించారు. మాన్‌హట్టన్‌లోని ఐరాస భవనంలో ఉన్న ఉత్తరకొరియా శాశ్వత ప్రతినిధికి ఇవ్వాలని భావించారు.

అమెరికా అధికారులు ఉత్తరకొరియా కార్యాలయం బయట చాలాసేపు ఎదురు చూశారు. ఈ క్రమంలో అటుగా నడుచు కొంటూ వెళుతున్న ఓ ఉత్తరకొరియా దౌత్య వేత్త చేతికి దానిని అందజేశారు. అతడు ఆ లేఖను తీసుకొన్నాక ఐరాస సమావేశంలో హాజరై.. తిరిగి వెళ్లే సమయంలో అమెరికా ప్రతినిధుల ఎదురుగా ఉన్న బల్లపై పెట్టేసి వెళ్లిపోయారు. ఆ లేఖ సీల్‌ కూడా ఓపెన్‌ చేయకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది. ట్రంప్‌ ఆసియా పర్యటన వేళ కూడా కిమ్‌తో భేటీకి తీవ్రంగా యత్నించారు. కానీ, ఉత్తరకొరియా వైపు నుంచి వచ్చిన షరతులు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేకపోవడంతో.. చేసేదేమీ లేక తిరిగి అమెరికా చేరుకొన్నారు.


ట్రంప్‌తో భేటీ తర్వాత బాగా పెరిగిన అణువార్‌హెడ్‌లు

2019లో కిమ్‌-ట్రంప్‌ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత నుంచి ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని చాలా వేగవంతం చేసింది. 2019లో 20-30 మధ్యలో ఉన్న ఆ దేశ వార్‌హెడ్‌ల సంఖ్య ఇప్పుడు 60కు చేరుకొంది. గతంలో కేవలం లిక్విడ్‌ ఫ్యూయల్‌ రాకెట్‌ మోటార్లను వాడే ఉత్తరకొరియా.. ఇప్పుడు సాలిడ్‌ ఫ్యూయల్‌ రాకెట్లు సిద్ధం చేసింది. వాటిని గుర్తించడం అమెరికాకు చాలా కష్టం

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్