Magazines

ఉదయ్‌వీర్‌ పసిడి గురి

47 నిమిషాల క్రితం

Udayveer's Golden Aim
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

కైరో (ఈజిప్ట్‌) : కైరోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్‌ ఉదయ్‌వీర్‌ సిద్దూ పసిడి పతకం సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మెరిసిన ఉదయ్‌వీర్‌ బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. అర్హత రౌండ్‌లో నాల్గో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్న ఉదయ్‌వీర్‌.. పతక వేటలో అగ్రస్థానంలో నిలిచాడు. 240.6 పాయింట్లు సాధించిన ఉదయ్‌వీర్‌.. రెండో స్థానంలో నిలిచిన జర్మనీ షూటర్‌ కంటే 0.5 పాయింట్ల ఆధిక్యంతో స్వర్ణం సాధించాడు. ఇటలీ షూటర్‌ 219.8 పాయింట్లతో కాంస్యం సాధించాడు. 2024 టోక్యో ఒలింపిక్స్‌లో కూల్‌ షూటింగ్‌తో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారిన టర్కీ షూటర్‌ యూసుఫ్‌ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్