నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై(సర్) ప్రతిపక్షాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా సర్ నిర్వహించాలనే ఆలోచన ఈసీ బృందంలో ఎవరూ నిర్ణయించారని, సదురు సర్వేపై పలు సందేహాలున్నాయని సుప్రీంకోర్టును ఇండియా బ్లాక్ కూటమి ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ మొత్తం 48 ప్రశ్నలతో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిల ప్రమేయం లేకుండానే కమిషన్‌కు ఉన్న ఉమ్మడి అధికారాలను ఏకపక్షంగా వినియోగించారా అన్నదే ఈ వివాదంలో కీలకమని రాహుల్ గాంధీ తదితరులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ముగ్గురు కమిషనర్లు స్వయంగా ప్రమాణపత్రాలు (Sworn Affidavits) దాఖలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆన్‌లైన్ ఫారం-6లో అదనపు సమాచారానికి ఈసీలో ఎవరు అనుమతి ఇచ్చారని, దానిని ఎప్పుడు ప్రవేశపెట్టారు, కమిషన్ దానిని ఆమోదించిందా లేదా అనే వివరాలను పిటిషన్ లో కోరారు.







కామెంట్‌లు (0)