నవతెలంగాణ - హైదరాబాద్ : ఎనిమిదేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో చోటుచేసుకున్న బాల్ టాంపరింగ్ (సాండ్‌పేపర్ గేట్) వివాదం ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌లను ఫాక్స్ స్పోర్ట్స్ కామెంటరీ విధుల నుంచి తప్పించింది. తిరిగి విధుల్లో చేరే తేదీని వెల్లడించలేదు.
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరికీ వ్యాఖ్యాన బాధ్యతలు ఇవ్వబోమని ఫాక్స్ స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ స్టీవ్ క్రావ్లీ తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. తన ఆత్మకథ *‘సబ్ర్’*లో సాండ్‌పేపర్ గేట్ వివాదంపై ఖవాజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అప్పటి జట్టు సభ్యుల వాంగ్మూలాలను మరోసారి పరిశీలించనున్నట్లు వెల్లడించింది. ఈ వివాదంలో స్టీవ్ స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ మాత్రమే బాధ్యులుగా చేయడం సరికాదని ఖవాజా పేర్కొన్నాడు.







కామెంట్‌లు (0)