నవతెలంగాణ - హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గుల్లీ గాలా ప్రాంతం సమీపంలో పేచౌండ్ నుంచి రామ్నగర్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రామ్నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్ అనంత్ ద్వివేది తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
లోయలో పడిన బస్సు.. 16 మందికి గాయాలు
21 అక్టోబర్, 2026

Bus falls into valley, 16 injured
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)