నవతెలంగాణ - హైదరాబాద్ : న్యాయమూర్తులను బెదిరించేలా, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకునే బహిరంగ సభలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వవద్దని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. అనుమతి పొందిన కార్యక్రమాల్లో జడ్జిలపై వ్యక్తిగత దాడులకు దిగితే వెంటనే సభను నిలిపివేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యాయపరమైన అంశాలపై సభలు, నిరసనలకు అనుమతి కోరినప్పుడు ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించాలని పోలీసులకు సూచించింది. న్యాయవ్యవస్థను కించపరిచే, బెదిరించే కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నైకి చెందిన ఆర్. కార్తికేయన్ దాఖలు చేసిన పిల్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ ఇచ్చిన ఓ తీర్పు అనంతరం తమిళనాడులో జరిగిన నిరసనలను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.







కామెంట్లు (0)