నవతెలంగాణ - హైదరాబాద్ : 2026 సాఫ్ (SAFF) ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. చివరి నిమిషాల్లో పాక్ రెండు గోల్స్ చేసి ఉత్కంఠ రేపినా.. భారత జట్టు విజయాన్ని కాపాడుకుంది. భారత్ తరఫున సుహైల్ అహ్మద్ భట్ అద్భుత ప్రదర్శన చేశాడు. 13వ నిమిషంలో తొలి గోల్ చేసిన అతడు, 19వ నిమిషంలో మరో గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. 32వ నిమిషంలో కిప్‌గెన్ మరో గోల్ చేయడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 3-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే మ్యాచ్ చివర్లో పాకిస్థాన్ పుంజుకుంది. 90వ నిమిషంలో నజీబుల్లా, 93వ నిమిషంలో ఘాజీ గోల్స్ చేయడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ భారత ఆటగాళ్లు ఆధిక్యాన్ని కాపాడుకుని 3-2తో విజయాన్ని అందుకున్నారు.
పాక్‌పై భారత్ ఘన విజయం..
15 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)