Magazines

టీమిండియాకు ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

3 గంటల క్రితం

Setback for Team India.. Star pacer ruled out of ODI series
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించినట్లు బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా ప్రసిద్ధ్‌కు గాయమైంది. ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ, మ్యాచ్‌లు ఆడేందుకు అవసరమైన పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. బౌలింగ్ భారాన్ని తట్టుకునే స్థాయికి చేరుకోకపోవడంతో న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్