నవతెలంగాణ-సత్తుపల్లి
గజల్ చారిటబుల్ ట్రస్ట్, భారతీయ విద్యా భవన్ సంయుక్త అధ్యర్యంలో బుధవారం గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగిన గజల్ 50 వసంతాల వేడుకలో సత్తుపల్లి గజల్ కవయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతకుమారి పురస్కారం అందుకున్నారు. తెలుగు గజల్ లెజెండ్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్ 60వ జన్మదినం, తెలుగు గజల్ ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలువురు గజల్ కవులు,కవయిత్రులు గుంటూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వారి గజల్స్ వేదికపై ఆలపించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నుంచి పాల్గొన్న కవయిత్రి గీతకుమారిని ప్రముఖులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, లగడపాటి రాజగోపాల్, గుమ్మడి గోపాలకృష్ణ, గజల్ శ్రీనివాస్ పాల్గొని ఘనంగా సత్కరించి అభినందించారు.







కామెంట్లు (0)