నవతెలంగాణ-ఆలేరు టౌను
శ్రీమన్నారాయణ వీరాచల జీడికంటి రామచంద్రస్వామి దేవాలయంలో కార్తీకమాస ఉత్సవాల కరపత్రాలను ఆలయ అర్చకులు మురళీకృష్ణ, శ్రీ వాసవి మాత ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వంగపల్లి ఆంజనేయస్వామితో కలిసి ఆలయ ప్రాంగణంలో శనివారం ఆవిష్కరించారు. ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు, ఆలయ కమిటీ చేపడుతుందన్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.







కామెంట్లు (0)