నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పోటీ పరీక్షల శిక్షణ, కెరీర్ గైడెన్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కేంద్రం (CCE) ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ), టీజీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తదితర పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు కేంద్రం డైరెక్టర్ డా. కొండ నాగేశ్వర్ తెలిపారు. ఈ శిక్షణకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లో చదువుతున్న రెగ్యులర్ పీజీ విద్యార్థులు, పీహెచ్‌డీ పరిశోధకులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 10, 2026లోగా సీసీఈ కార్యాలయంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫారాలను ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పని దినాల్లో కార్యాలయ వేళల్లో 8331041332 నంబరును సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.






కామెంట్‌లు (0)