Magazines

నూతన భవనంలోకి 'శస్త్ర'హాస్పిటల్

7 గంటల క్రితం

Shastra Hospital
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం


- ప్రారంభించిన మంత్రి తుమ్మల,ఎమ్మెల్యే రాగమయి దయానంద్


నవతెలంగాణ-సత్తుపల్లి


సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో వైద్య సేవలు అందిస్తున్న 'శస్త్ర'హాస్పిటల్ అదే రోడ్డులోని నూతన భవనంలోకి మార్చబడింది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ గోగినేని వినీష్ కృష్ణ ఆహ్వానం మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ కలిసి మంగళవారం ప్రారంభించారు.సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు మాట్లాడుతూ...ఆసుపత్రి మరింత మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఆసుపత్రి ప్రధాన వైద్యులు గోగినేని వినీష్ కృష్ణ మాట్లాడుతూ...నూతన భవనంలోకి మార్చబడిన మా ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


ల్యాపరోస్కోపీ,ఎండోస్కోపీ,లేజర్ సర్జరీలు,అపెండిసైటిస్,హెర్నియా,హిస్టెరెక్టమీ (గర్భాశయాన్ని శస్త్రచికిత్స తొలగించే ప్రక్రియ),పైల్స్ తదితర సమస్యలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్,నాయకులు చల్లగుళ్ల నరసింహారావు,మొహమ్మద్ కమల్ పాషా,పట్టణ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,భీమిరెడ్డి సుబ్బారెడ్డి,వినుకొండ కృష్ణ,దమ్మపేట జెడ్పీటీసీ సభ్యులు పైడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్