Magazines

మద్నూర్ లో ఘనంగా దసరా ఉత్సవాలు గుర్రపు సవారిపై సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి

6 గంటల క్రితం

Usha Santosh Mestri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ మద్నూర్

దసరా పండుగ సంబరాలు మద్నూర్ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మద్నూర్ మండల కేంద్రంలో దసరా ఉత్సవాల సందర్భంగా రావణ దిష్టిబొమ్మను దహనం చేశారు. మొదట మండల కేంద్రంలోని ఆర్య సమాజ్ మందిరం నుండి గుర్రపు సవారిపై గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఊరేగింపుగా దసరా ఉత్సవాలు రావణ దహన కాండ స్థలం ఎల్లమ్మ గుట్టకు చేరుకొని అక్కడ వేలాదిమంది జనాల మధ్య దసరా పండుగ ఉత్సవాలు అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులు జనాన్నికానికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రావణ దిష్టిబొమ్మకు సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి చేతుల మీదుగా దహనం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకరినొకరు కలుస్తూ ప్రజలంతా దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్