నవతెలంగాణ-మల్హర్ రావు
కాటారం మండలంలోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామమైన ధన్వాడకు ఆదివారం అవధూత దత్త పీఠాధిపతి, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ విచ్చేశారు. ఈ సందర్భంగా ధన్వాడ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోక కల్యాణార్థం ప్రత్యేకంగా నిర్వహించిన మహాపూర్ణాహుతి కార్యక్రమంలో తాడిచెర్ల పీఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య దంపతులు పాల్గొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులతో కలిసి గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సుభిక్షం కలగాలని మంత్రి దంపతులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్లు (0)