Magazines

ఇంటి నంబర్ సరిహద్దుల ప్రకారం సవరించాలి

50 నిమిషాల క్రితం

The house number should be corrected according to the boundaries.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

- ప్రజావాణిలో ఎంపీడీవోకు సుల్తాన్ పేట్ నివాసి రాజు ఫిర్యాదు

నవతెలంగాణ-మద్నూర్

ఇంటి నంబర్ సరిహద్దుల ప్రకారం కాదని రిజిస్ట్రేషన్ నిలిపివేయడం జరిగిందంటూ సరి చేయాలని విజ్ఞప్తి చేస్తూ సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన రాజు తండ్రి బస్వంత్ అనే వ్యక్తి ఎంపీడీవో పి సాయిలు కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్థల వివాదం ఈ విధంగా పేర్కొన్నారు. సుల్తాన్ పెట్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజు తండ్రి బస్వంత్ అనే వ్యక్తి ఆ గ్రామంలోని గుంజేవారు పోచన్న తండ్రి గురువన్న వద్ద కాలి స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు.


ఈ స్థలానికి గతంలో పదవి విరమణ పొందిన గ్రామ కార్యదర్శి మురళి ఇంటి నంబర్3-1 గా చూపించడం జరిగిందని ఈ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లగా సరిహద్దుల ప్రకారం ఇంటి నంబర్ కాదని రిజిస్ట్రేషన్ అధికారులు తెలపడంతో తాను కొన్న స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నానని ఇంటి నంబర్ సరి చేయమని ప్రస్తుతం గ్రామ కార్యదర్శిగా ఉన్న సంజయ్ని విన్నవించినప్పటికీ అతను నా సమస్య పరిష్కరించడం లేదని గ్రామ సర్పంచ్ కూడా సహకరించడం లేదంటూ సోమవారం నాడు ప్రజావాణిలో ఎంపీడీవోకు ఈ సమస్య పరిష్కారం కోసం ఫిర్యాదు అందజేశారు. ఈ సమస్య పట్ల ప్రజావాణిలో అక్కడే ఉన్న మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు దారులతో మాట్లాడుతూ ఈ సమస్య పట్ల సమగ్ర విచారణ జరిపి న్యాయం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల స్థాయిలో న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఫిర్యాదు చేస్తానని నా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్