Magazines

ప్రజావాణికి మూడు దరఖాస్తులు

40 నిమిషాల క్రితం

Three applications submitted to 'Praja Vani'
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-తొగుట

ప్రజావాణికి మూడు దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీఓ పి.వి. నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం మూడు దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇందులో ఒకటి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం, ఒకటి రెవెన్యూ సమస్యపై, మరొకటి వృద్ధాప్య పెన్షన్ మంజూరు కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తు లను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. 17 ఆగస్టు నుండి ప్రారంభ మయిన ప్రజావాణి ఇప్పటి వరకు 10 సోమవారం పూర్తి అయ్యయని అన్నారు. మొత్తం 28 మంది దరఖాస్తులు చేశారాని, రెవిన్యూ సమస్యలు కోసం 6, ఇందిరమ్మ ఇండ్లు కోసం 17, మండల కేంద్రంలో కస్తూర్బ పాఠశాల వైపు రోడును బాగు చేయాలని 1, గృహజ్యోతి 1, వృద్ధాప్య పెన్షన్ కోసం 1, ఇతర సమస్యలపై 2 దరఖాస్తులు వచ్చినట్లు వివరించా రు. ఈ కార్యక్రమంలో ఎంపీవో విష్ణు వర్ధన్, ఏఓ మోహన్, ఏపిఓ నర్సింహారెడ్డి, ఎంపీవో బాబు, పిఆర్ ఏఈ ఇర్పాన్, అంగన్వాడీ సూపర్ వేజర్ శ్రీలక్ష్మి, తదితర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్